కుటుంబ సభ్యులతో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసిన చిరంజీవి... వైరల్ వీడియో ఇదిగో!

  • 'ఉస్తాద్ భగత్ సింగ్' స్పెషల్ స్క్రీనింగ్ 
  • కుటుంబసమేతంగా సినిమాను పూర్తిగా ఆస్వాదించిన మెగాస్టార్
  • చిత్ర బృందం కృషిని అభినందించిన చిరంజీవి
  • 'వాన వాన వెల్లువాయే', 'ఈ మనసే' పాటలకు ప్రత్యేక ప్రశంస
  • ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను ప్రతి క్షణం ఆస్వాదించానని, తమ్ముడి నటన అద్భుతంగా ఉందని ఆయన అభినందించారు.

వివరాల్లోకి వెళితే, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో, తన తమ్ముడి సినిమాను వీక్షించిన చిరంజీవి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఈ చిత్రంలోని 'వాన వాన వెల్లువాయే', 'ఈ మనసే' పాటలు తెరపై రాగానే ఆయన ముఖంలో ఆనందం కనిపించింది. ఈ పాటల చిత్రీకరణ, సంగీతం పట్ల ఆయన ప్రత్యేకంగా స్పందించారు.

పవన్ కల్యాణ్ నటనతో పాటు, దర్శకుడు హరీశ్ శంకర్ టేకింగ్, చిత్ర బృందం పడిన కష్టాన్ని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. 

కాగా, ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా కూడా విచ్చేశారు. వారు థియేటర్లో చిరంజీవి, సురేఖ దంపతుల పక్కనే కూర్చున్నారు.

Pawan Kalyan
Ustaad Bhagat Singh
Chiranjeevi
Harish Shankar
Anna Lezhneva
Telugu Movie
Mega Star
Vana Vana Velluvaye
Ee Manase
Tollywood

More Telugu News